తెరాస గౌరవాన్ని మరింత పెంచండి: విప్‌
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

తెరాస గౌరవాన్ని మరింత పెంచండి: విప్‌

ఆత్మకూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత, చిత్రంలో గొంగిడి మహేందర్‌రెడ్డి

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: నాయకులు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండి పార్టీ గౌరవాన్ని మరింత పెంచేలా పనిచేయాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత సూచించారు. మండల కేంద్రంలో శనివారం తెరాస మండల స్థాయి సమావేశంలో మాట్లాడారు. పార్టీ వల్లే తమకు గుర్తింపు వచ్చిందని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌, భాజపా నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారిని తెరాస శ్రేణులు నిలదీయాలని డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో తెరాస నిర్వహించే విజయగర్జనను విజయవంతం చేయాలని కోరారు. తెరాస మండల అధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్‌, ఎంపీటీసీ సభ్యురాలు వై.కవిత, నాయకులు బి.ఉప్పలయ్య, పి.పూర్ణచందర్‌రాజు, వై.ఇంద్రారెడ్డి, కె.భిక్షపతి, జి.దశరథ, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆలేరు: తెరాస ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే ద్విదశాబ్ది ప్లీనరీని, నవంబర్‌ 15న వరంగల్‌లో చేపట్టనున్న విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. ఆలేరులో శనివారం జరిగిన తెరాస ఆలేరు మండల, పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. విజయోత్సవ సభకు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు చొప్పున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆలేరు పుర ఛైర్మన్‌ వస్పరి శంకరయ్య, తెరాస మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌యాదవ్‌, ఆలేరు పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశంగౌడ్‌, కుండె సంపత్‌, మొరిగాడి వెంకటేశ్‌, కాసగల్ల అనసూర్య, జూకంటి ఉప్పలయ్య పాల్గొన్నారు.

గుండాల: విజయగర్జన సభ నేపథ్యంలో మండల కేంద్రంలోని వాసవీ గార్డెన్‌లో నిర్వహించిన తెరాస ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. పార్టీ నూతన నాయకత్వంపై కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నాయకులకు సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఖలీల్‌, ఎంపీపీ తాండ్ర అమరావతి, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, తెరాస నాయకులు పాండరీ, రామకృష్ణ్ణారెడ్డి, సంగి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని