చట్టాలపై అవగాహనతో అక్రమాలు అడ్డుకోవచ్చు
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

చట్టాలపై అవగాహనతో అక్రమాలు అడ్డుకోవచ్చు

భువనగిరి: సదస్సులో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి రజని

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన ఉన్నట్లయితే సమాజంలో అక్రమాలు, నేరాలు జరగకుండా అడ్డుకోవచ్చని సీనియర్‌ సివిల్‌ జడ్జి రజని అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాన్‌ ఇండియా లీగల్‌ అవేర్నెస్‌ అవుట్‌ రీచ్‌ క్యాంపేయిన్‌ కార్యక్రమాన్ని శనివారం భువనగిరిలో నవభారత్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. న్యాయమూర్తి రజని మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌, అపహరణ, అత్యాచారం వంటి నేరాలకు గురైన బాధితులకు దక్కే న్యాయం, ఆ నేరాలకు విధించే జైలు శిక్ష, జరిమానాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అందరికీ ఉచితంగా న్యాయం అందించడానికి న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు, న్యాయసేవాధికార సంస్థ న్యాయవాదులు, ప్యారా లీగల్‌ వాలంటరీ  వెంకటేశ్‌ పాల్గొన్నారు.

బీబీనగర్‌: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భువనగిరి అడిషనల్‌ జ్యూడిషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జావిద్‌ తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బీబీనగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. పలు చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు, న్యాయవాదులు  ఏఎస్సై మధార్‌ పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట పట్టణం: న్యాయం అందుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆలేరు జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ న్యాయమూర్తి సుమలత తెలిపారు. మాసాయిపేటలో శనివారం న్యాయ సేవలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సర్పంచి సువర్ణ, వైస్‌ ఎంపీపీ ప్రసన్న, ఎస్సైలు యాదయ్య, శేఖర్‌, న్యాయవాదులు  పాల్గొన్నారు. 

రాజపేట: రాజపేటలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆలేరు సివిల్‌కోర్డు జడ్జి సూర సుమలత హాజరై చట్టాలు, న్యాయసేవలను వివరించారు. సర్పంచి ఈశ్వరమ్మ, తహసీల్దారు పి.జయమ్మ, ఎంపీడీవో నల్ల రామరాజు, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని