నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ


సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట నేరావిభాగం, న్యూస్‌టుడే: అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్‌, పీడీ యాక్టు కేసులు తప్పవని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న కేసుల తీరు, పెండింగ్‌ కేసుల వివరాలను ఠాణాల వారీగా అడిగి తెలుసుకున్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు అధికారులు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. జిల్లాలోని పాత నేరస్థులు, అక్రమ వ్యాపారులు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై దృష్టి సారించాలన్నారు. గంజాయి సీజ్‌ చేయడంలో ప్రతిభ చూపిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ వినోద్‌లకు ఎస్పీ రివార్డులు అందించారు. డీఎస్పీలు రఘు, మోహన్‌కుమార్‌, రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ, సీఐలు ఆంజనేయులు, విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి, రామలింగారెడ్డి, రాజేష్‌, నర్సింహరావు పాల్గొన్నారు.

సమావేశానికి హజరైన జిల్లా పోలీసు అధికారులు

పోలీసు వాహనాల తనిఖీ..  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక వాహనాలు సమకూర్చిందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని పోలీసు వాహనాలను శనివారం తనిఖీ చేశారు. పోలీసు వాహనాల నిర్వహణ, నాణ్యతపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని