బస్సును ఢీకొట్టిన పాఠశాల వాహనం
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

బస్సును ఢీకొట్టిన పాఠశాల వాహనం

ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన పాఠశాల బస్సు

చండూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చి పాఠశాల బస్సు ఢీకొట్టిన ఘటన దోనిపాముల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. చండూరులోని ఓప్రైవేటు పాఠశాల బస్సు మర్రిగూడ మండలం లెంకలపల్లికి వెళ్లి పిల్లలను తీసుకొని చండూరుకు వస్తోంది. దోనిపాములకు వచ్చే సరికి ఎదుట ఉన్న ఆర్టీసీ బస్సు ప్రయాణికుడిని ఎక్కించుకునే క్రమంలో డ్రైవర్‌ ఆకస్మికంగా బ్రేక్‌ వేశారు. పాఠశాల బస్సు డ్రైవర్‌ కూడా బ్రేక్‌ వేసినా అదుపుతప్పి బస్సును వెళ్లి చిన్నగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు పిల్లలకు డ్రైవర్‌కు, పిల్లలకు ఏమీ కాలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని