పట్టపగలే రెండిళ్లలో చోరీ
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

పట్టపగలే రెండిళ్లలో చోరీ

రూ. 17 లక్షల సొత్తు అపహరణ

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో పట్టపగలే రెండు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీటీ కాలనీలో బండారు గార్డెన్‌కు వెళ్లే దారిలో సూర్యాపేట జడ్పీ సూపరింటెండెంట్‌ బసవోజు శ్రీనివాసాచారి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య కృష్ణవేణి శనివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అది గమనించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న పధ్నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 9.76 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం వచ్చిన కృష్ణవేణి దొంగతనం జరిగినట్లు గుర్తించి భర్తతో కలిసి ఫిర్యాదు చేసినట్లు టూటౌన్‌ ఎస్సై నర్సింహులు తెలిపారు. అదేవిధంగా మీర్‌బాగ్‌ కాలనీకి చెందిన ఫజీల్‌ ఉన్నీసా శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంటికి తాళం వేసి తన కుమారుడికి బడిలో భోజనం ఇవ్వడానికి వెళ్లారు. గమనించి దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న తులం బంగారం నగలతో పాటు రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. రెండు ఘటనా స్థలాలను టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, క్లూస్‌టీం సిబ్బంది పరిశీలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని