పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలి
eenadu telugu news
Updated : 24/10/2021 16:49 IST

పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలి

భువనగిరి : తెరాసను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణస్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసి, రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు సైతం దక్కకుండా ముందస్తు వ్యూహంతో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారులను గుర్తించి, వారిని పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేలా చూడాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని, ప్రతి వార్డు నుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇనబోయిన ఆంజనేయులు, వైస్‌ ఛైర్మన్‌ కిష్టయ్య, పార్టీ సీనియర్‌ నాయకులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని