మరణించినా.. ఎనిమిది కుటుంబాల్లో వెలుగులు
eenadu telugu news
Published : 26/10/2021 08:46 IST

మరణించినా.. ఎనిమిది కుటుంబాల్లో వెలుగులు


జీవన్మృతుడు సతీష్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇంటికి పెద్దదిక్కు ఊహించని రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్మృతుడు (బ్రెయిన్‌డెడ్‌) కాగా.. పుట్టెడు దుఃఖంలోనూ అతని అవయవాల దానంతో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు  ముందుకు  వచ్చి ఆదర్శంగా నిలిచింది. ఓ కుటుంబం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉండే మెతుకు సతీష్‌(46) హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ప్రైవేట్‌ కంపెనీలో సెల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 21న విధులకు హాజరయ్యేందుకు భువనగిరి నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ మండలం అన్నోజీగూడ వద్ద జాతీయ రహదారిపైన ట్యాంకర్‌ లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యారు. అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. మృతుడికి భార్య లక్ష్మీకళ్యాణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మీకళ్యాణి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒక కుమార్తె ఇంజినీరింగ్‌, మరో కుమార్తె ఫిజియోథెరపీ, కొడుకు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. జీవాన్‌దాన్‌ సంస్థ సభ్యులు అవయవదానం ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకొన్నారు. అవయవాలు తీసుకొన్న అనంతరం మృతదేహాన్ని సోమవారం భువనగిరికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని