తల్లిదండ్రుల బాధ్యత వారసులదే: ఎస్పీ
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

తల్లిదండ్రుల బాధ్యత వారసులదే: ఎస్పీ

సూర్యాపేటలో ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, రక్షణ బాధ్యత వారుసులపైనే ఉంటుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజా వాణిలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. వృద్ధ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామన్నా రు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

చెక్కు అందజేత... కోదాడ గ్రామీణ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు సోమవారం పోలీసు చేయూత పథకం ద్వారా చెక్కును అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని