సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్‌


మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై అధికారులు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖాధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కరోనా టీకా వంద శాతం పూర్తి అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, రెండు పడక గదుల ఇళ్లపై దరఖాస్తులు వస్తున్నందున వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 60 దరఖాస్తులు అందాయని తెలిపారు. డీపీవో యాదయ్య, డీఆర్డీవో కిరణ్‌కుమార్‌, సీపీవో వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, ఏవో శిరిష పాల్గొన్నారు.

ఆరుతడి పంటలపై సమీక్ష
వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రబీ పంట సాగుకు సంబంధించిన ప్రణాళికలను తయారు చేయాలన్నారు. వరి ధాన్యాన్ని రానున్న సీజన్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేసే పరిస్థితులు లేనందున రైతులు 11 రకాలైన ఆరుతడి పంటలు పండించేలా అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న రైతు వేదికలలో క్లస్టర్‌ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరుతడి పంటల సాగు వైపు రైతులను మళ్లించాలని వివరించారు. జిల్లాను విత్తన కేంద్రంగా తయారు చేయాలని సూచించాన్నారు. దళారుల వద్ద విత్తనాలకు కొనుగోలు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పామాయిల్‌ పంట సాగుకు ముందుకొచ్చే రైతులకు సాగు విధానంపై వివరించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. డీఏవో రామారావు నాయక్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్‌, ఏడీఏలు సంధ్యారాణి, జగ్గినాయక్‌, వాసు, శాస్త్రవేత్తలు భారత్‌, నరేష్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని