హుజూర్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

హుజూర్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌

ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆరోపణలు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆధారాలు లేకుండా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ చేసినందుకు హుజూర్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ నగేశ్‌ సస్పెండ్‌ అయ్యారు. సోమవారం రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ ఐజీ కార్యాలయ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లా డీఆర్‌ ప్రవీణ్‌కుమార్‌ నగేశ్‌ను సస్పెండ్‌ చేశారు. ఇటీవల హుజూర్‌నగర్‌ పురపాలక పరిధిలోని మాధవరాయనిగూడెంలో ఇంటి స్థలానికి ఎలాంటి ఆధారం లేకుండా పురపాలక పన్ను చెల్లింపు రసీదు ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. మాధవరాయనిగూడేనికి చెందిన చప్పిడి దుర్గయ్యకు, చప్పిడి ప్రసాద్‌కు ఈ ఇంటి స్థలం విషయంపై వివాదం ఉంది. దీనిని ఎవరికీ రిజిస్ట్రేషన్‌ చేయవద్దని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా రిజిస్ట్రేషన్‌  చేయటంతో చప్పిడి ప్రసాద్‌ ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు. అన్నదమ్ముల భాగాలపంపిణీలో తమకు హక్కు ఉన్నా.. ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేశారనే దానిపై ఫిర్యాదులు చేయటంతోపాటు, ఇంటి స్థలం విషయంపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. దీనిపై శాఖాపరమైన విచారణ జరిగింది. అవసరమైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేశారని ఉన్నతాధికారులకు నివేధిక ఇవ్వటంతో ఐజీ ఉత్తర్వులు మేరకు జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ సబ్‌రిజిస్ట్రార్‌ నగేశ్‌ను సోమవారం సస్పెండ్‌ చేశారు. చండూరులో పనిచేస్తున్న ఇంఛార్జి రిజిస్ట్రార్‌ విజయ్‌కు బాధ్యతలు అప్పగించటంతో ఆయన విధుల్లో చేరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని