ఇంటర్‌ పరీక్షలు షురూ
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

ఇంటర్‌ పరీక్షలు షురూ


చౌటుప్పల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

భువనగిరి గ్రామీణం, యాదగిరిగుట్ట పట్టణం, ఆలేరు, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌, రామన్నపేట, మోత్కూర్‌: కొవిడ్‌ కారణంగా మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో వాయిదా పడిన మొదటి సంవత్సరం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, వలిగొండ, చౌటుప్పల్‌లో ఏర్పాటుచేసిన 44 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. చౌటుప్పల్‌, భువనగిరి డివిజన్‌లలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, మూడు సిట్టింగ్‌ స్వ్కాడ్‌లు పని చేస్తున్నాయని ఇంటర్‌ బోర్డు నోడల్‌ అధికారి బుగ్గ సంజీవ తెలిపారు. తొలి రోజు జరిగిన సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలకు 7523 మంది హాజరు కావాల్సి ఉండగా 6865 మంది(91.25 శాతం) విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. చౌటుప్పల్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సుచిత్ర, సత్యనారాయణలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.  కొవిడ్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు జరిగాయి.


భూదాన్‌పోచంపల్లిలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని