నాణ్యమైన ధాన్యం తీసుకురండి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

నాణ్యమైన ధాన్యం తీసుకురండి: కలెక్టర్‌

ధాన్యం సేకరణపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, పక్కన అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. వరి ధాన్యం సేకరణపై స్థానిక మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని డీఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లకు కూడా ఈ పంటకాలం ధాన్యం మిల్లింగ్‌ కోసం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దిగుమతి విషయంలో రైస్‌ మిల్లర్లు సహకరించాలని కోరారు. మిల్లర్లకు ఎదురవుతున్న సమస్యలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంప నాగేందర్‌ కలెక్టర్‌కు వివరించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో డీసీఎస్‌వో, ఎంసీఎస్‌సీ, డీఏవో, మిల్లర్లు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి
భువనగిరి గ్రామీణం: ఈ యాసంగిలో రైతులతో వరికి బదులు ప్రత్యామ్నాయంగా కంది, వేరుసెనగ, మినుము, మొక్కజొన్న తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగుచేేయించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి, కమిషనరేట్‌ కార్యాలయ డీడీఏ సింగిరెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలోని రాయగిరి రైతువేదికలో సోమవారం వ్యవసాయాధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. వరి పండించిన రైతులకు ప్రభుత్వం యాసంగిలో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వదని, ఎఫ్‌సీఐ నుంచి కొనుగోళ్లు జరగనందున ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలన్నారు. ప్రతి రైతు వేదికలో 200 నుంచి 300మంది రైతులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి అనురాధ, ఏడీఏ, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని