
పొగాకు బేళ్లను తగులబెట్టిన రైతులు
మర్రిపాడు: డి.సి పల్లిలోని పొగాకు వేలం కేంద్రానికి రైతులు భారీగా పొగాకు బేళ్లను తీసుకొచ్చారు. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో నిర్వాహకులను రైతులు నిలదీశారు. దీంతో పొగాకు వేలం నిలిచిపోయింది. ఆగ్రహించిన రైతులు అధికారుల వైఖరిని నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి పొగాకు బేళ్లను తగులబెట్టారు. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.174, కనిష్ఠ ధర రూ.80 ఉంది. లాక్డౌన్ తర్వాత ప్రారంభమైన కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. ధరలు పుంజుకుంటాయని రైతులు ఆశతో ఎదురు చూశారు. ఎంతకీ ధరలు పెరగకపోవడంతో నిరాశకు గురై ఆందోళనకు దిగారు. కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.130 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేలం బోర్డు నిర్వాహకులు, కంపెనీ ప్రతినిధులను కోరుతున్నారు.
Tags :