భార్యనే కడతేర్చాడు!
eenadu telugu news
Updated : 17/09/2021 11:55 IST

భార్యనే కడతేర్చాడు!

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే : మద్యానికి బానిసయ్యాడు.. తాగవద్దని భార్య, పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతిచెందిన సంఘటన కావలి పట్టణ పరిధిలోని ముసునూరు ఇందిరమ్మకాలనీలో గురువారం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న పాలూరి మోహనాచారీ, వెంకటలక్ష్మీ(52) భార్యాభర్తలు. వీరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో క్యాంటిన్‌ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త మద్యానికి బానిసై డబ్బులకు ఇబ్బందులు పెట్టేవారు. ఈ నేపథ్యంలో గురువారం మేడపై నిద్రపోతున్న ఆమెను డబ్బులు కావాలని అడగగా నిరాకరించింది. దాంతో రొకలి బండతో ఆమె తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్‌, సీఐ అక్కేశ్వరరావు, ఎస్సైలు ప్రభాకర్‌రెడ్డి, వీరేంద్రబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని