ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి


మాట్లాడుతున్న ఏడీఏ శివన్నారాయణ

వరికుంటపాడు, న్యూస్‌టుడే : మారుతున్న పరిస్థితులకనుగుణంగా సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తే నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ శివన్నారాయణ అన్నారు. స్థానిక బాలుర వసతి గృహంలో గురువారం మండల వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆర్బీకేల్లో వీఏఏలు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు చేస్తారన్నారు. పీఏసీఎస్‌ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు, సర్పంచులు దిలీప్‌కుమార్‌, ప్రతాప్‌రెడ్డి, మండల ఏఏబీ ఛైర్మన్‌ బొడ్డు వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయాదికారి సుబ్బారెడ్డి, పశువైద్యాధికారి నాగార్జున, ఏఈవో శివజ్యోతి, వీఏఏలు మాట్లాడారు. సంగం: రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని రైతులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీహరి సూచించారు. సంగం ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సభ్యుల శిక్షణ సమావేశం జరిగింది. పశువైద్యాధికారి చంద్రశేఖరరెడ్డి, రిసోర్సుపర్సన్‌ శైలజకుమారి, తరుణవాయి సర్పంచి ఆర్‌.శోభ తదితరులు హాజరయ్యారు. వింజమూరు: వింజమూరు సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులకు శిక్షణ శిబిరం జరిగింది. వింజమూరు-1, 2, 3, బుక్కాపురం, గుండెమడకల, శంకవరం ఆర్‌బీకేల పరిధిలోని సభ్యులకు కూడా శిక్షణ ఇచ్చారు. ఏవో కిషోర్‌బాబు, ఉద్యాన అధికారిణి బి.జ్యోతి, పట్టు పరిశ్రమ శాఖ సాంకేతిక సహాయకులు సుధాకరరాజు, పశువైద్యాధికారి కోటేశ్వరరావు పాల్గొన్నారు. అనుమసముద్రంపేట: ఈ-క్రాప్‌ బుకింగ్‌, సున్నా వడ్డీ పథకం, కొనుగోలు కేంద్రాలు, పంటల ఉచిత బీమా పథకం వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలని ఏవో రజని తెలిపారు. ఏఎస్‌పేట మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. చేజర్ల: విపణులు, వాతావరణానికి అనువుగా పంటల సాగు చేపట్టాలని వ్యవసాయాధికారి వి.శశిధర్‌ సూచించారు. ఆదూరుపల్లిలో నిర్వహించిన ఏఏబీ సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఏఏబీ సభ్యుల విధుల గురించి వివరించారు. ఉద్యానాధికారి లక్ష్మి, పశువైద్యాధికారి రాజేష్‌ సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఏఈవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ, పశుసంవర్థక సహాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని