విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం


ప్రమాణ స్వీకారం చేస్తున్న సంఘ నాయకులు

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే : విద్యా, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలను కల్పించి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం విరాట్‌నగర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మండపంలో జరిగిన జిల్లా సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులుగా కందుకూరు చెంగయ్య, అధ్యక్షులుగా ఆత్మకూరు వీరరాఘవాచారి, ప్రధాన కార్యదర్శిగా పోకూరి శ్రీనివాసులు, కోశాధికారిగా బందరుగట్టు వెంకట సుధాచారి ప్రమాణం చేశారు. జిల్లా నుంచి రాష్ట్ర సంఘ కమిటీలో చోటు దక్కించుకున్న కాపులూరు చెంచుకృష్ణ, ఐ.రమేష్‌, టి.రమేష్‌కుమార్‌, ఇ.శివకుమార్‌, ఆచారి సుబ్రహ్మణ్యం, ఎన్నూరి మురళి, శివరామకృష్ణ, కె.రమేష్‌, డి.నాగార్జునాచారి, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరి, ఉపాధ్యక్షురాలు రోజారాణి ప్రమాణ స్వీకారం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని