డీసీఎంఎస్‌ బలోపేతానికి కృషి
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

డీసీఎంఎస్‌ బలోపేతానికి కృషి

 
ప్రసంగిస్తున్న ఛైర్మన్‌ వీరి చలపతిరావు 

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే : జిల్లాకో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ సొసైటీ ఛైర్మన్‌ వీరి చలపతిరావు తెలిపారు. నగరంలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో గురువారం మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతులకు ఆర్‌బీకేలు చేరువగా ఉండటం ద్వారా కొన్ని రకాల వ్యాపారాలు వాటికి వెళ్లిపోతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా ఆసుపత్రుల మందులు, పంచాయతీ శానిటేషన్, తదితర వ్యాపారాలను తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న పాత రైసుమిల్లు స్థానంలో వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తమ పరిధిలో గోదాముల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్లు రంగనాథం, సలీం, సురేష్‌రెడ్డి, బీఎం వెంకటస్వామి, మార్క్‌ఫెడ్‌ డీఎం నాగరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డిపాజిట్ల పెంపుపై దృష్టి
నెల్లూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: కేంద్ర సహకార బ్యాంకు ద్వారా డిపాజిట్ల పెంపుపై దృష్టి సారించాలని డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సూచించారు. స్థానిక బ్యాంకు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మహాజన సభ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నా... జిల్లాలో బ్యాంకు వాటా ఒక శాతమే ఉందన్నారు. 20 పీఏసీఎస్‌లను మల్లీ సర్వీస్‌ సెంటర్లుగా మార్చుతున్నామని, మరో 12 పీఏసీఎస్‌లలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేశామని తెలిపారు. కంప్యూటరీకరణ వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నామని, దుత్తలూరు, జలదంకి, డక్కిలి, తడ ప్రాంతాల్లో కొత్త శాఖలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వీరి చలపతిరావు, సీఈవో చల్లా శంకర్‌బాబు, డీసీవో తిరుపాల్‌రెడ్డి, జీఎం, డీజీఎం, ఏజీఎంలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. 


మాట్లాడుతున్న డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని