ఫలితాల పెంపునకు కృషి
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

ఫలితాల పెంపునకు కృషి


ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న చినవీరభద్రుడు

తిమ్మారెడ్డిపల్లె(వరికుంటపాడు), న్యూస్‌టుడే: విద్యార్థులతో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు సూచించారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద ఏర్పాటు చేసిన వసతులను గురువారం ఆయన పరిశీలించారు. మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించుకుని.. మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో ఆ మేరకు ఏర్పాటు చేశామని ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసులురెడ్డి చెప్పడంతో అభినందించారు. కమిషనర్‌ను ఎంఈవో షావుద్దీన్‌ సన్మానించారు. ఆదర్శ పాఠశాలల రాష్ట్ర సంయుక్త సంచాలకులు రవీంద్రారెడ్డి, సర్వశిక్షా అభియాన్‌ ప్రకాశం జిల్లా సీఎంవో కొండారెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని