తెదేపాతోనే మహిళలకు రక్షణ
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

తెదేపాతోనే మహిళలకు రక్షణ

నాయకురాళ్లతో అబ్దుల్‌ అజీజ్‌, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి

నెల్లూరు (ఇరిగేషన్‌), న్యూస్‌టుడే : మహిళల రక్షణకు కృషి చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ, నగర, గ్రామీణ, నియోజకవర్గాల మహిళా కమిటీల పేర్లను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. పార్లమెంటు మహిళా అధ్యక్షురాలిగా భూలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కొమరి విజయ, నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలిగా రేవతి, ప్రధాన కార్యదర్శిగా రోజారమణి పేర్లను అజీజ్‌ ప్రకటించారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికి సుముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని