తెల్లరాయి తవ్వకాలపై విజిలెన్స్‌
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

తెల్లరాయి తవ్వకాలపై విజిలెన్స్‌


పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

 

వరికుంటపాడు, న్యూస్‌టుడే: వరికుంటపాడు మండలంలో తెల్లరాయి అక్రమ తవ్వకాలపై బుధవారం మైనింగ్‌శాఖ విజిలెన్స్‌ అధికారులు ఆరా తీశారు. నామమాత్ర అనుమతులతో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఖనిజాన్ని కొల్లగొడుతున్న తీరుపై ఈ నెల 24న ‘ఈనాడు’లో అనుమతుల రగడ.. అక్రమార్కుల పడగ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మైనింగ్‌శాఖ విజిలెన్స్‌ అధికారులు బుధవారం జడదేవి, తూర్పుచెన్నంపల్లి, అలివేలిమంగాపురం, గువ్వాడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 98, 142, 143, 130, 30లో తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. అనుమతులు ఎలా ఇచ్చారు? ఎంత మేరకు ఉన్నాయి? ప్రస్తుతం ఎంత మేరకు తవ్వకాలు చేశారనే అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు. గురువారం రెవెన్యూ, మైనింగ్‌ రికార్డులను బేరీజు వేసుకుని నివేదికలు తయారు చేస్తామని మైనింగ్‌శాఖ విజిలెన్స్‌ ఏజీ ఆనంద్‌, ఆర్‌ఐ మురళి, సీఐ మాణ్యిరావు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వోలు చంద్రమౌళి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని