ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత

ఇసుకరీచ్‌ వద్ద వాహనాలకు అడ్డుగా కూర్చున్న గ్రామస్థులు

కోవూరు, న్యూస్‌టుడే: మినగల్లులో ఇసుక ట్రాక్టర్లు, లారీలను గ్రామస్థులు బుధవారం రెండో రోజూ అడ్డుకున్నారు. తమ గ్రామ పరిధిలోని పెన్నా నది నుంచి నిత్యం వేలాది వాహనాల ద్వారా ఇసుక తరలించేవారు.. గ్రామంలోని వారు ఇళ్లు నిర్మించుకుంటామంటే మాత్రం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికే అధికంగా తరలించారని, భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని