ఆకట్టుకున్నజాగిలాల విన్యాసం
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ఆకట్టుకున్నజాగిలాల విన్యాసం

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పోలీసు కవాతు మైదానంలో బుధవారం నిర్వహించిన పోలీసు జాగిలాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో పాటు నెల్లూరుగ్రామీణ డివిజన్‌ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం కొనసాగింది. జాగిలాల ప్రదర్శనకు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు తన కుటుంబంతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని