ఆత్మకూరులో మెగా జాబ్‌మేళా 30న
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ఆత్మకూరులో మెగా జాబ్‌మేళా 30న


గోడపత్రిక ఆవిష్కరించిన జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఖయ్యూం

 

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఆత్మకూరు పాలిటెక్నిక్‌ కళాశాల మెగా జాబ్‌మేళాకు సిద్ధమైంది. ఈ నెల 30న శనివారం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. 22 కంపెనీలు హాజరవుతాయి. 1040మంది పైనే యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యం. ప్రముఖ కంపెనీలు హీరో, ఇసుజు, అమరరాజా, బజాజ్‌, హ్యుందాయ్‌, అపాచీ, ఫ్లిప్‌కార్ట్‌, టాటాస్టీల్‌, అపోలో, మెడికవర్‌, హెటిరో ఫార్మా, వంటి ప్రముఖ కంపెనీలతోపాటు మొత్తం 22 కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, బీటెక్‌, డిప్లమా ఇన్‌ మెడికల్‌, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వారు పాల్గొనవచ్ఛు ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ధ్రువ పత్రాలు, ఆధార్‌లతో హాజరు కావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కోరుతోంది. యువత జాబ్‌మేళా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఖయ్యూం కోరారు. బుధవారం అనంతసాగరం ఎంపీడీవో కార్యాలయంలో గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. డీఆర్‌డీఏ జాబ్‌డీఎం హైమవతి, నిరీక్షణ, సౌమ్య ఎంపీడీవో మధుసూదనరావు, ఏపీఎం సతీష్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని