ఏపీజీబీ వ్యాపార లక్ష్యం రూ.5,430 కోట్లు
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ఏపీజీబీ వ్యాపార లక్ష్యం రూ.5,430 కోట్లు


ఛైర్మన్‌ రాకేష్‌కశ్యప్‌ నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న జగదేవిపేట శాఖ మేనేజర్‌ శ్రీనివాసరావు

 

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో రూ.5,047 కోట్ల వ్యాపారాన్ని చేసిందని, డిసెంబరు చివరికి రూ.5,430 కోట్ల వ్యాపారాన్ని సాధించే లక్ష్యంతో పనిచేయాలని ఆ బ్యాంకు ఛైర్మన్‌ రాకేష్‌కశ్యప్‌ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఆ బ్యాంకు అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న పండుగలను పురస్కరించుకుని బ్యాంకు ఖాతాదారులకు తక్కువ వడ్డీకి రుణాలను అందించే పథకాలను చేరువచేసే రుణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు. లక్ష్యాలు చేరుకున్న బ్యాంకు మేనేజర్‌లను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ ఎం.జగదీశ్వరరావు, నెల్లూరు రీజినల్‌ మేనేజర్‌ వి.కోటేశ్వరరావు, చీఫ్‌ మేనేజర్‌ పి.వి.రమణ, మేనేజర్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని