రండి.. తెలుసుకుందాం !
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

రండి.. తెలుసుకుందాం !

పిల్లలకు పోలీసు విధులు, ఆయుధాలపై అవగాహన

● అబ్బురపరుస్తున్న ఓపెన్‌హౌస్‌


ఆయుధాల పనితీరును విద్యార్థులకు వివరిస్తున్న పోలీసులు

‘తుపాకీ’ అంటే ఆసక్తి ఉండని వారెవరు చెప్పండి.. అదే పిల్లల్లో అయితే మరీ ఎక్కువ. బొమ్మ తుపాకులతో ఇళ్ల దగ్గర అదరగొట్టేస్తుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే స్ఫూర్తితో విద్యార్థులకు పోలీసు విధులు, వారు ఉపయోగించే ఆయుధాలపై అవగాహన కల్పించేందుకు రెవెన్యూ డివిజన్ల వారీగా ఏటా పోలీసు శాఖ ఓపెన్‌హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో అన్ని రకాల ఆయుధాలు ప్రదర్శనగా ఉంచి వాటి ప్రత్యేకతలు, వినియోగించే సమయాలను తెలుపుతున్నారు. ఇక్కడి తుపాకులు, మెషిన్‌గన్లు చూసిన చిన్నారులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. - న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

22 రైఫిల్‌: పోలీసు తొలి విధులు ఈ రైఫిల్‌తోనే ప్రారంభిస్తారు. ఈ ఆయుధాన్ని శిక్షణకు వచ్చే జవాన్లకు ఇస్తారు. కొత్తగా ఉద్యోగానికి వచ్చిన వారిలో భయం తొలగించేందుకు దీన్ని ఇస్తారు. ఈ తుపాకీతో 20 గజాల దూరం వరకు కాల్చవచ్ఛు బాల సైనికులైన ఎన్‌సీసీ క్యాడెట్లు కూడా ఈ ఆయుధాన్ని ఎక్కువగా వినియోగిస్తారు.

303 రైఫిల్‌: ఈ ఆయుధాన్ని 1902 డిసెంబరు 23న జేమ్స్‌ కనిపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఆయుధాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఒక్కసారి 10 తూటాలను లోడ్‌ చేసుకోవచ్ఛు బుల్లెట్‌ తగిలిందంటే శత్రువు అంతమే.

కార్బైన్‌ (మిషన్‌ గన్‌) : వీఐపీల బందోబస్తు విధుల్లో ఉండే వారు ఉపయోగించే ఆయుధమిది. వీటిని ఉపయోగించడం చాలా సులువు. వీఐపీలు వీధుల్లో తిరిగేటప్పుడు భద్రత సిబ్బంది పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. ఎస్‌ఎల్‌ఆర్‌ లాంటి ఆయుధాలైతే అందరికీ తగులుతాయి. అందుకే వీఐపీల రక్షణకు కార్బైన్‌ను వాడుతున్నారు. దీనిలో 32 తూటాలుంటాయి. 30 గజాల వరకు తూటా వెళుతుంది. ఒక వ్యక్తికి మాత్రమే తగిలి ఆగిపోతుంది.

ఏకె-47: ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఆయుధం ఇది. 1947లో రష్యాకు చెందిన మైఖేల్‌ ఈ ఆయుధాన్ని కనిపెట్టారు. ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఇందులో 30 తూటాలుంటాయి. నిమిషానికి 550 నుంచి 600 తూటాలు పేల్చవచ్ఛు

 

గ్రెనేడ్‌ : శత్రువుల సమూహం, గుంపులపై ఈ గ్రెనేడ్‌ బాంబును ప్రయోగించి హతమార్చవచ్ఛు అసాంఘిక శక్తులు, మావోయిస్టులు గదుల్లో కూర్చొని ఉన్నప్పుడు వారిని హతమార్చాలంటే తుపాకులతో దాడి చేయడం కన్నా సులభంగా ఇలాంటి బాంబులను వేసి హతమార్చవచ్ఛు

 

రైఫిల్‌ 7.62 : దీన్ని అసాంఘిక శక్తులపై ఉపయోగించవచ్ఛు 20 తూటాలు ఒకేసారి లోడ్‌ చేయవచ్ఛు ఎక్కడైనా దేశద్రోహులు గుంపులుగా ఉండి కాల్పులు జరిపి సందర్భాల్లో ఈ ఆయుధాన్ని ఉపయోగించవచ్ఛు

 

ఎస్‌ఎల్‌ఆర్‌: ఈ ఆయుధాన్ని బెల్జియం దేశానికి చెందిన డీసీ షేయి కనిపెట్టారు. ఇది సెమీ ఆటోమేటిక్‌ గన్‌. ఇందులో 20 తూటాలు నింపుకోవచ్ఛు ఒక్కసారి నొక్కితే తూటాలు ఏకబికిన బయటకు వెళతాయి. దీన్ని కూడా స్పెషల్‌ పార్టీ, జనరల్‌ విధుల్లో ఉండే పోలీసులు ఉపయోగిస్తుంటారు.

పిస్తోల్‌: దీనిలో మూడు రంగులుంటాయి. ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు. ఎక్కడైన అసాంఘిక శక్తులున్నట్లు భద్రత సిబ్బందికి తెలియజేయాలంటే ఎరుపు రంగును, రాత్రివేళల్లో తెలుపు రంగును, పరిస్థితి బాగుందని తెలియజేసేందుకు ఆకుపచ్చ రంగును ఆకాశంలోకి వదులుతారు.

గ్యాస్‌గన్‌: అల్లరి మూకలను చెదరగొట్టేందుకు గ్యాస్‌గన్‌లను ఉపయోగిస్తారు. వీటితో ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. గ్యాస్‌ బాంబును ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టవచ్ఛు ఈ పొగతో కళ్లు మంటలు వస్తాయి. ఆ మంటలకు భయపడి అల్లరిమూకలు పరిగెత్తుతారు. అలాగే రబ్బరు తూటాలను ఉపయోగిస్తారు. ఇవి మనిషికి తగిలితే నొప్పి పుడుతుంది. అంతే తప్ప ఎలాంటి ప్రాణాపాయం ఉండదు.

388 రివాల్వర్‌ : ఈ ఆయుధాన్ని పోలీసు అధికారులు ఉపయోగిస్తారు. ఎప్పుడూ వారి వద్ద ఉంటుంది. రివాల్వర్‌లో ఆరు తూటాలుంటాయి. చేతిలో పట్టుకునేందుకు సులువుగా ఉంటుంది. క్షణాల్లో తీసి అసాంఘిక శక్తులపై కాల్పులు జరపవచ్ఛు

9 ఎంఎం పిస్తోల్‌ : దీన్ని బెల్జియం దేశస్థులు కనిపెట్టారు. ఇందులో 13 తూటాలుంటాయి. సెమీ ఆటోమేటిక్‌ పద్ధతిపైపనిచేస్తుంది. కాల్చిన ప్రతిసారి ‘కాక్‌’చేయాలి. అంటే ముందుకు వెనక్కు జరిపితే తూటా లోడ్‌ అవుతుంది.

9 ఎంఎం గ్లాక్‌ పిస్తోల్‌: ఈ ఆయుధంలో 17 తూటాలుంటాయి. అధికారులు ఎక్కువగా ఉపయోగిస్తారు. 17 తూటాలు ఒకేసారి లోడ్‌ చేసుకోవచ్ఛు దానినే మాగ్జిన్‌ అంటారు. ఇది పేలకుండా లాక్‌చేసే సదుపాయం ఉంటుంది.

పోలీసు శాఖ పనితీరు తెలుస్తుంది

సీహెచ్‌ విజయరావు, ఎస్పీ : పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందనేది ఈ ఓపెన్‌ హౌస్‌తో విద్యార్థులకు తెలుస్తుంది. భావిభారత పౌరులైన విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పోలీసుల విచారణ, వీఐపీ భద్రత, ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల నిర్వహణ, మావో ప్రభావిత ప్రాంతాలు, ఉగ్రవాద దాడుల్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తామో వివరిస్తాం. ఒక పోలీసు స్టేషన్‌ నుంచి మరో పోలీసు స్టేషన్‌ను ఎలా సంప్రదిస్తాం, ఒక ఘటన జరిగినప్పుడు పోలీసులు ఎలా అప్రమత్తమవుతారు? డ్రోన్లను ఏ విధంగా ఉపయోగిస్తామనేది చూపిస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు ఎలా ఉపయోగిస్తామో ప్రదర్శిస్తాం. దాంతో విద్యార్థులకు పూర్తి అవగాహన వస్తుంది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని