close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీటి కుంట.. సిరుల పంట

ఇంకుడు గుంతలతో పెరిగిన భూగర్భ జలాలు
36 ఎకరాల్లో పంటల సాగు  
ఆదర్శంగా నిలుస్తున్న లింగంపల్లి రైతు
రుద్రూర్, న్యూస్‌టుడే

పొలంలోని  ఫాంపాండ్‌

తొమ్మిది బోరుబావులు తవ్వించారు. నాలుగింట్లో చుక్క నీరు పడలేదు. మిగతా బోర్లూ ఎత్తిపోయే దశకు చేరుకున్నాయి. బీడుగా మారుతున్న పొలాన్ని చూసి ఏదైనా చేయాలని తపించారు. ఇంకో రెండు బోర్లు వేద్దామనుకున్నా నీళ్లు పడతాయనే నమ్మకం లేదు. అదే సమయంలో ఫాంపాండ్, ఇంకుడు గుంతల గురించి తెలుసుకుని నిర్మించారు. ఎత్తిపోతున్న బోరుబావులన్నీ రీఛార్జయ్యాయి. ప్రస్తుతం 36 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు బోధన్‌ మండలం మినార్‌పల్లి గ్రామానికి చెందిన పూర్ణయ్య.  
ఆయనకు రుద్రూర్‌ మండలం లింగంపల్లి శివారులో 36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చెరువులు, బోరు బావుల ఆధారంగా పంటలు సాగు చేస్తుంటారు. గతంలో ఈ ప్రాంతంలో నీటి కొరత ఎక్కువగా ఉండేది. ఆయన 9 బోరుబావులు తవ్వించిన పూర్తిస్థాయిలో నీరు పోసేవి కాదు. కొన్ని ఎకరాలు బీడుగా వదిలేసేవారు.
ఒక రోజు రెంజల్‌ మండలానికి చెందిన ఓ రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. బోరుబావులు రీఛార్జయ్యే విధానాన్ని వివరించారు.
రూ.8 లక్షలు ఖర్చు చేసి..
వ్యవసాయాధికారుల సలహా తీసుకున్న తర్వాత ఇంకుడు గుంతలతో పాటు ఫాంపాండ్‌ నిర్మాణానికి సిద్ధమయ్యారు. 20 గుంటల్లో రూ.7 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. చుట్టూ పాలిథిన్‌ పట్టా వేసి పొలాలకు నీటి అవసరం లేనప్పుడు ఇందులోకి మళ్లిస్తున్నారు. అనంతరం స్ప్రింకర్ల ద్వారా మెట్టకు, వరి పంటకు నీటిని అందిస్తున్నారు. ఒక్కో బోరుబావి దగ్గర ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.33 వేలు ఖర్చు చేశారు. పొలాల్లో పడ్డ వర్షపు నీటిని, మడులు నిండిన తర్వాత వృథాగా బయటకు పోయే నీటిని ఇంకుడు గుంతలోకి వెళ్లే ఏర్పాటు చేశారు. బోరుబావుల్లో నీటి సామర్థ్యం గణనీయంగా పెరిగి 36 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.  
నిర్మాణం ఇలా...
ఆరు ఫీట్ల లోతు, ఆరు ఫీట్ల వెడల్పుతో గుంతలు తవ్వాలి. 3 ఫీట్ల మేర 80-120 మి.మీ రాళ్లు వేయాలి. అనంతరం 2 ఫీట్లు 20 మి.మీ కంకరతో నింపాలి. చివరగా 12 మి.మి రాళ్లతో నింపి కేసింగ్‌ పైప్‌నకు చిన్నచిన్న రంధ్రాలు వేసి జాలి బిగించాలి. బోరుబావి చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు పెడితే ఇంకుడు గుంత నిర్మాణం పూర్తవుతుంది.
సాగు చేస్తున్న పంటలు
తనకున్న 36 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల్లో వరి, 7 ఎకరాల్లో చెరకు, 8 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో పసుపు, 3 ఎకరాల్లో బొప్పాయి.
నీటి కొరత ఉండదు
- పూర్ణయ్య, రైతు

రైతులు తమ పొలాల్లోని బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. వర్షపు నీటితో పాటు మడుల్లో వృథాగా పోయే నీటిని అందులోకి మళ్లించాలి. భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావులు సమృద్ధిగా నీరు ఎత్తిపోస్తాయి. భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా అరికట్టవచ్చు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.