Published : 19/10/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భూవివాదంలో వృద్ధుడిపై కర్రతో వ్యక్తి దాడి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్‌ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని మాల్తుమ్మెదలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భూ వివాద ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే... మాల్తుమ్మెదకు చెందిన రాంకిష్ణయ్య అనే వృద్ధుడికి, రాజయ్య అనే వ్యక్తికి మధ్య గత కొంతకాలంగా భూ విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భూ వివాదంలో శనివారం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రాంకిష్ణయ్యపై రాజయ్య కర్రతో దాడిచేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంకిష్ణయ్య ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని