Published : 14/01/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పతంగులతో పరేషానొద్దు

● ఉత్సాహం కావొద్దు విషాదం

● చైనా మాంజా వాడకంపై నిషేధం

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

సంక్రాంతి అనగానే పిల్లలు, యువత గాలిపటాలు ఎగరేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది పతంగులు ఎగరేస్తూ ఆరుగురు చనిపోయారు. మరోవైపు నిషేధిత చైనా మాంజాను వాడడంతో పక్షులు మృత్యువాత పడుతున్నాయి.

గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పతంగులు ఎగరేస్తూ ఆరుగురు మరణించారు. నిజామాబాద్‌లో నలుగురు, కామారెడ్డిలో ఇద్దరు చొప్పున ఉన్నారు. గాలిపటాలు ఎగరేయాలనే ఉత్సాహంలో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించకపోవడంతో ఈ దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. అందులోనూ విద్యుత్తు తీగల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పక్షుల ప్రాణాలకు ప్రమాదమే..

దేశంలో చైనా మాంజా వాడకంపై నిషేధం అమల్లో ఉంది. అయినా పలువురు గాలిపటాలు ఎగురవేయడానికి దీన్ని వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ మాంజా వాడకంపై పోటీపడుతున్నారు. భవనాలకు, చెట్లకు, విద్యుత్తు తీగలకు ఇది చుట్టుకుంటుంది. పక్షులు అక్కడ వాలినప్పుడు దారంలో చిక్కుకుపోతు మరణిస్తున్నాయి. గతేడాది వేలాది సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయని ఓ సర్వేలో తేలింది.

ఇవి పాటించాలి

*● చిన్నమేడలు, సైడ్‌వాల్స్‌ లేని డాబాలు, విద్యుత్తు తీగలకు దగ్గరగా ఉండే అంతస్తులపైనా పతంగులు ఎగురవేయకూడదు.

*● నిర్మాణంలో ఉన్న భవనాలపైకి చిన్నారులు ఎక్కడం ప్రమాదకరం.

*● రహదారులపైనా, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎగరేస్తే అవి చిక్కుకుపోతాయి. తెగిపడిన గాలిపటాల కోసం చిన్నారులు పరుగులు పెట్టొద్ధు

*● పక్షులు ఎక్కువగా తిరిగే దగ్గర, చెరువులు, వాగుల సమీపంలో జాగ్రత్తగా ఉండాలి.
 


ప్రమాదాలు మృతులు జరిమానా విధించాం

ఆంజనేయులు, నిజామాబాద్‌ ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో

చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలపై ఇటీవల దాడులు చేశాం. గాంధీచౌక్‌లో ఓ వ్యాపారి వద్ద మాంజాను గుర్తించి రూ.15 వేలు జరిమానా విధించాం. ఎవరైనా దీన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని