న్యాయచైతన్య సదస్సు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

న్యాయచైతన్య సదస్సు

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయసేవా సంస్థ న్యాయవాది రాజ్‌కుమార్‌ సుబేదార్‌ అన్నారు. నిజామాబాద్‌లోని బురుడుగల్లీలో ఆదివారం న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలు చట్టాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. న్యాయవాది ఆశానారాయణ పాల్గొన్నారు.


ఇంక్రిమెంట్లలో కోత ఉండదు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: సబ్‌ ఇంజినీర్లుగా రివర్షన్‌కు గురైన 11 మంది ఏఏఈలకు నోషనల్‌ ప్రమోషన్స్‌ ఇస్తూ తిరిగి ఏఏఈలుగా కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్పీడీసీఎల్‌ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ ప్రభాకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు పనిచేసిన సర్వీస్‌ కాలంలో పొందిన ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలు తిరిగి తీసుకోవచ్చన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని