సమాజ అభ్యున్నతికి సాహిత్యం అవసరం
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

సమాజ అభ్యున్నతికి సాహిత్యం అవసరం

మాట్లాడుతున్న తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌శిక్షక్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: సమాజ అభ్యున్నతికి సాహిత్యం అవసరమని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌శిక్షక్‌ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కర్షక్‌ బీఈడీ కళాశాలలో ఆదివారం సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువ కవులు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే రచనలు చేయాలన్నారు. కవిత్వం ద్వారా మంచిని పంచాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కవితాస్త్రలు ఎక్కుపెట్టాలన్నారు. ప్రముఖ కవి సురారం శంకర్‌ మాట్లాడుతూ.. సగటు మనిషికి బాసటగా నిలిచే రచనలు అవసరమన్నారు. సామాజిక సమస్యలపై గళమెత్తాలని కోరారు. కార్యక్రమంలో కవులు గంగాప్రసాద్‌, నాగభూషణం, రాంచంద్రం, మోహన్‌రాజ్‌, నవీన్‌రెడ్డి, శేషారావు, పీతాంబర్‌, రమేశ్‌, చైతన్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని