ఫుట్బాల్‌ టోర్నీ విజేత తమిళనాడు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

ఫుట్బాల్‌ టోర్నీ విజేత తమిళనాడు

గెలుపొందిన క్రీడాకారులతో ప్రతినిధులు

ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ నిర్వహించిన వహీద్‌ మెమోరియల్‌ జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజేతగా తమిళనాడు జట్టు నిలిచింది. కేర్‌ ఫుట్‌బాల్‌ జట్టుతో జరిగిన తుదిపోరులో తమిళనాడు 3- 0తో గెలుపొందింది. వర్షం కారణంగా మూడో స్థానానికి పోటీ నిర్వహించలేకపోవడంతో హైదరాబాద్‌, కేరళ జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీత, ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు షబ్బీర్‌అలీ హాజరై బహుమతులు అందజేశారు. అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ, కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్‌ పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు షకీల్‌, ఖలీల్‌, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరాల రత్నాకర్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లింగం పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని