గ్రామీణ సేవా కేంద్రాలు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

గ్రామీణ సేవా కేంద్రాలు

న్యూస్‌టుడే, మాచారెడ్డి

పిట్లంలో సీఎస్‌సీ

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో పౌర సేవా కేంద్రాలు అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగా అనేక సేవలు అందిస్తుండటంతో ప్రజాధరణ పొందుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు సేవలన్నీ ఆన్‌లైన్‌ ఆధారంగానే కొనసాగుతుండడంతో వీటి ప్రాధాన్యం పెరిగింది. స్థానిక యువతకే వీటి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు కేంద్ర, రాష్ట్ర పథకాలు చేరువ చేసేందుకు 51 మండలాల్లో 710 సీఎస్‌సీలు ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల్లో ఉంటున్న వారు సులభంగా అనేక సేవలు పొందుతున్నారు. ఇంటర్మీడియెట్, ఆపై చదువుకున్న వారు వీటి నిర్వహణ చేపట్టి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. కొంత మందికి కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉపాధి కల్పిస్తున్నారు. ఒక్కో కేంద్రం ద్వారా నెలకు రూ.20- 25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది.

స్థానికంగానే ఎన్నో..
* ఈ కేంద్రాల ద్వారా 200కు పైగా సేవలు అందుతుండటంతో గ్రామీణ ప్రజలకు పట్టణాలు, మండల కేంద్రాలకు వెళ్లే అవసరం తగ్గిపోయింది.

* ధరణి పోర్టల్‌, పీఎం కిసాన్‌, ఈ-శ్రమ్‌, సైబర్‌ సెక్యూరిటీ, పీఎం గ్రామీణ డిజిటల్‌ సాక్షరత్‌ అభియాన్‌, డీజీ-పే, కృషి విజ్ఞాన కేంద్రం, ఆధార్‌  నమోదు, రైతు బంధు, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, వాహనాల బీమా, గ్రామీణ ఈ-స్టోర్‌, బస్సు, రైలు, విమాన టికెట్‌ బుకింగ్‌, న్యాయ సలహాలు, టెలీ కన్సల్టెంట్‌, నానో ఇఫ్కో, యూరియా విక్రయం ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వంటి సేవలకు జనం వస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.  

* నూతన ఓటరు నమోదు, ఓటరు కార్డుల్లో తప్పుల సవరణ, పాన్‌కార్డు దరఖాస్తు వంటి సేవలను స్థానికులు సద్వినియోగం చేసుకుంటున్నారు.


నిరుద్యోగులు వినియోగించుకోవాలి
- శంకర్‌, మేనేజర్‌, జిల్లా సీఎస్‌సీ ఈ గవర్నెన్స్‌

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా మరిన్ని సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వాలని నిర్ణయించింది. ఇంటర్‌ పూర్తి చేసిన నిరుద్యోగులు, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌పై అవగాహన ఉన్న వాళ్లకు అవకాశం ఇస్తున్నాం. నిరుద్యోగ యువతీ, యువకులు వినియోగించుకొని ఉపాధి పొందవచ్చు. వివరాలకు 63004 90312 చరవాణి నంబరులో సంప్రదించవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని