రైతు ప్రయోజనాలకే చెక్‌డ్యామ్‌లు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

రైతు ప్రయోజనాలకే చెక్‌డ్యామ్‌లు

వేల్పూర్‌, న్యూస్‌టుడే: రైతు ప్రయోజనాల కోసమే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెక్‌డ్యామ్‌లు నిర్మించారని డీసీసీబీ వైస్‌ఛైర్మన్‌ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్‌లో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. పచ్చలనడ్కుడ చెక్‌డ్యామ్‌ 8 నుంచి 12 ఫీట్లకు పెంచినది వాస్తవమేనన్నారు. దీనివల్ల గుత్తేదారుకు రూ.35 లక్షల నష్టం వాటిల్లడం తప్ప రూపాయి లాభం లేదని చెప్పారు. మంత్రి బంధువులు గుత్తేదారులుగా ఉన్నా.. రూపాయి లబ్ధి పొందినట్లు నిరూపిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకొంటామని అన్నారు. లేకుంటే ఎంపీ తప్పుకొంటారా అని ప్రశ్నించారు. రైతులకు ఎకరానికి రూ.3 వేల పరిహారం చెల్లించింది ప్రభుత్వ నిబంధనల ప్రకారమేని పేర్కొన్నారు. మిగతా నష్టం అందించడానికి ఇతర మార్గాల ద్వారా మంత్రి కృషి చేస్తానని స్వయంగా అన్నదాతలకు హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. తెరాస మండలాధ్యక్షుడు జైడి నాగధర్‌రెడ్డి, మహిపాల్‌, రాములు, రాకేష్‌చంద్ర, రాజేశ్వర్‌ తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని