అలీసాగర్‌ గేటు ఎత్తివేత
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

అలీసాగర్‌ గేటు ఎత్తివేత

పర్యాటకుల సందడి

ఎడపల్లి, న్యూస్‌టుడే: అలీసాగర్‌ గేటును ఆదివారం ఉదయం అధికారులు ఎత్తారు. శనివారం కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వరద జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 304 ఎంసీఎఫ్‌టీలు కాగా ప్రస్తుతం 283 నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు ఉండగా దిగువకు 300 విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ ఏఈ రాజ్యలక్ష్మి తెలిపారు.

ఎస్సారెస్పీ..
శ్రీరాంసాగర్‌ : శ్రీరాంసాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 20 గేట్లు ఎత్తి 74,880 క్యూసెక్కులు గోదావరిలోకి వదిలారు. 7.45 గంటల సమయానికి 10,500 క్యూసెక్కులకు వరద తగ్గడంతో గేట్లను మూసేశారు. ఎస్కెప్‌ గేట్ల నుంచి 3500, కాకతీయ కాల్వకు 4 వేలు, సరస్వతికి 800, మిషన్‌ భగీరథకు 152 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. 1090.90 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.


సాగర్‌లోకి స్వల్పంగా వరద నీరు

నిజాంసాగర్‌, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సాగర్‌లోకి స్వల్పంగా 2400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు. వరద నీరు రావడంతో ఆదివారం జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 2400 క్యూసెక్కులు, ప్రధాన వరద గేటు నుంచి 7400 క్యూసెక్కుల  నీటిని మంజీరలోకి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నిండుకుండలాగా ఉందని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని