జీపీఎస్‌ అమలుపై వెనుకడుగు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

జీపీఎస్‌ అమలుపై వెనుకడుగు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

చెత్త సేకరించే వాహనాలు

సాంకేతికత వినియోగంలో నగర పాలక సంస్థ వెనుకంజలో ఉంది. పక్కనే ఉన్న మెట్‌పల్లి పురపాలక సంఘంలో చెత్త సేకరించే వాహనాలకు జీపీఎస్‌ విధానం అమలు చేస్తుంటే కార్పొరేషన్‌ స్థాయిలో ఉన్న నిజామాబాద్‌ ఆ విధానానికి దూరంగా ఉంది. బల్దియాలో చెత్త సేకరణకు ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, కంపాక్టర్లు అన్ని కలిపి 114 వరకు ఉన్నాయి. ఆటోరిక్షాల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ చేపడుతున్నారు. మిగిలిన వాటి ద్వారా ప్రధాన రహదారులపై చెత్త ఎత్తి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. రోజు 180 మె.ట చెత్త సేకరణ జరుగుతోంది.

రూ.10 వేల చొప్పున వెచ్చించి..
చెత్త వాహనాలకు గతంలో జీపీఎస్‌ పరికరాలు బిగించారు. ఒక్కో దాన్ని రూ.10 వేలు వెచ్చించి కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం వాటి జాడ లేకుండా పోయింది. ఎన్ని పరికరాలు కొన్నారో లెక్క లేదు. ఈ విధానంతో ఇబ్బందవుతుందని డ్రైవర్లు వాటిని తీసేసినట్లుగా ప్రచారం జరిగింది. జీపీఎస్‌ ఉంటే వాహనం ఎటు వెళ్తుందో తెలుస్తోంది. పారిశుద్ధ్య పర్యవేక్షకులు వారి చరవాణికి, ఎంహెచ్‌వో, కమిషనర్‌ ఛాంబర్‌లో కంప్యూటర్లకు అనుసంధానించుకోవచ్చు. కేటాయించిన డివిజన్‌కు వాహనం వెళ్తుందా లేదా చూసుకోవచ్చు. వాహనాలను ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగిస్తే తెలిసిపోతుంది. జీపీఎస్‌ విధానం అమలు చేసే అంశం పరిశీలిస్తానని నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని