కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరం లాంటివి
eenadu telugu news
Updated : 18/10/2021 17:39 IST

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరం లాంటివి

బీర్కూర్‌: పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరం లాంటివని తహసీల్దారు రాజు, జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 28 కల్యాణలక్ష్మి, 6 షాదీముబారక్‌ చెక్కులను తొమ్మిది గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఎంపీటీసీ సందీప్‌, సర్పంచిలు బాబూరావు, అంబయ్య, క్రిష్ణారెడ్డి, రైసస గ్రామ అధ్యక్షుడు గంగారాం పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని