పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు
eenadu telugu news
Published : 21/10/2021 06:16 IST

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

ప్రసంగిస్తున్న అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌, చిత్రంలో డీఐఈవో లోకం రఘురాజ్‌

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కొత్త అంబేడ్కర్‌ భవన్‌లో చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఇన్విజిలేటర్ల కొరత ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కొవిడ్‌ లక్షణాలుంటే ప్రత్యేక గదిలో పరీక్ష రాయించాలని సూచించారు. డీఐఈవో లోకం రఘురాజ్‌ మాట్లాడుతూ.. విజయ్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని చైతన్య ఉన్నత పాఠశాలకు మార్చామన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపళ్ల సంతకాలు అవసరం లేదని వెల్లడించారు. మొదటి సంవత్సరం చదివిన కళాశాలలోనే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్‌, చిరంజీవి, కనకమహాలక్ష్మి, హైపవర్‌ కమిటీ చిన్నయ్య, విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని