సలాం..పోలీస్‌
eenadu telugu news
Published : 21/10/2021 06:16 IST

సలాం..పోలీస్‌

నేడు సంస్మరణ దినం
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

నిజామాబాద్‌ పరేడ్‌ మైదానంలోని పోలీసు అమరవీరుల స్థూపం

దేశ రక్షణ కోసం సైనికులు సరిహద్దులో పోరాడుతుంటే సమాజ రక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు, నక్సల్స్‌ దాడిలో ఇప్పటి వరకు ఎంతో మంది అసువులు బాసారు. వీరి సేవలను గుర్తు చేసుకుంటూ పోలీసు శాఖ ఏటా ఈ నెల 21న అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తోంది.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 1987 నుంచి 2017 వరకు 24 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. ఇందూరులో 18, కామారెడ్డిలో ఆరుగురు ఉన్నారు. వీరి కుటుంబాలను పోలీసు శాఖ తరపున ఏటా ఘనంగా సత్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఏ కష్టం వచ్చినా పోలీసు అధికారులు అండగా నిలుస్తున్నారు.
నిర్వహించడంతో పాటు ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల సేవలు ప్రజలకు తెలిసేలా ప్రధాన కూడళ్లు, పోలీసు స్టేషన్లలో అవగాహన కల్పించనున్నారు. రక్తదాన శిబిరాలతో పాటు కళాజాత కార్యక్రమాలు చేపట్టనున్నారు.


ఇంటి స్థలం కేటాయింపు..  పోలీసు అమరవీరుల కుటుంబాలకు నాగారం శివారులోని ఆర్టీఏ కార్యాలయం పక్కన ఇంటి స్థలాలు కేటాయించారు. నిజామాబాద్‌ ఆర్డీవో రవి, పోలీసు శాఖ అధికారుల సమక్షంలో బుధవారం డ్రా పద్ధతిలో 200 గజాల చొప్పున ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అప్పగించారు.
నేడు ఫ్లాగ్‌ డే..  నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరేడ్‌ మైదానంలో గురువారం ఉదయం 8.45కు ఫ్లాగ్‌ డేను నిర్వహించనున్నారు. ఉభయ జిల్లాలకు చెందిన 24 మంది అమరులకు స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. నిజామాబాద్‌ పాలనాధికారి నారాయణరెడ్డి, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. కాగా ఈ నెల 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉండనున్నాయి. వ్యాసరచన పోటీలు


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని