ఏ సమస్య వచ్చినా..
eenadu telugu news
Published : 21/10/2021 06:16 IST

ఏ సమస్య వచ్చినా..

..రషీద్‌, అమరవీరుడి కుమారుడు
మా నాన్న ఎం.ఏ గఫార్‌. 2000లో మాక్లూర్‌ ఠాణాలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పెద్ద దిక్కును కోల్పోయిన మాకు పోలీసు శాఖ అండగా ఉంది. వెంటనే నాకు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం కల్పించారు. ఏ ఆపదొచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారు.

 


అండగా ఉంటాం
..కార్తికేయ, సీపీ, నిజామాబాద్‌

అమరవీరుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్నివేళల్లో అండగా ఉంటుంది. అమరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కమిషనరేట్‌ పోలీసుల తరపున ఈసారి పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.


అన్నను కోల్పోయి..
..శ్రీనివాస్‌, అమరవీరుని సోదరుడు

మా అన్న గంగాధర్‌ 1996లో కానిస్టేబుల్‌గా ఉన్న సమయంలో నక్సల్‌ దాడిలో మరణించారు. ఆ తర్వాత ప్రభుత్వం నాకు వైద్యారోగ్య శాఖలో ఉద్యోగమిచ్చింది. మా కుటుంబ యోగక్షేమాలను పోలీసుశాఖ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఎన్‌ఐబీ విభాగం వారు అన్నివేళలా అండగా ఉంటున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని