కవులు సమాజానికి మార్గదర్శకులు
eenadu telugu news
Published : 21/10/2021 06:20 IST

కవులు సమాజానికి మార్గదర్శకులు

మాట్లాడుతున్న తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌శిక్షక్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కవులు సమాజానికి మార్గదర్శకులని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌శిక్షక్‌ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక అంశాలపై కవులు స్పందించాలన్నారు. ప్రజలను చైతన్యపరిచే రచనలు అవసరమన్నారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి మోహన్‌రాజ్‌, ప్రతినిధులు గంగాప్రసాద్‌, విజయశ్రీ, నాగభూషణం, కౌడి రవీందర్‌, స్వామి, లింగం, తిరుపతిరావు తదితరులున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని