ఇంధనం జాగ్రత్త
eenadu telugu news
Published : 21/10/2021 06:33 IST

ఇంధనం జాగ్రత్త

చైనాలో విద్యుత్తు సంక్షోభం కారణంగా పరిశ్రమలకు సరఫరాలో కోత. మరికొన్ని దేశాలూ ఇదే దారిలో..
అంతర్జాతీయంగా చమురు వెల పెరగడంతో మండుతున్న పెట్రో ధరలు..
సహజవాయువు నిల్వలు తగ్గి విద్యుదుత్పత్తిపై ప్రభావం..
బొగ్గు కోసం గనుల వద్ద వాహనాల బారులు..


స్వీయ నియంత్రణే  ప్రయోజనం విద్యుత్తు ఉత్పత్తి.. నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కరెంటు కోతలు, ఛార్జీలు పెంచాల్సి రావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఇంట్లో కరెంటు తంట.. బయటకొస్తే పెట్రో మంట అన్నట్లు తయారైంది పౌరుల పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితి నుంచి వెలుపలకొచ్చేందుకు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంది.

వీటితో మనకేంటి సంబంధం అనుకుంటున్నారా? ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా.. స్వల్ప కాలంలోనే ప్రపంచాన్ని చుట్టేసి వ్యవస్థలను అతలాకుతలం చేసేసింది. గ్లోబలైజేషన్‌లో ప్రపంచమే కుగ్రామమైంది. వ్యాధులైనా.. సంక్షోభాలైనా.. ఒకచోట మొదలైతే అంతటా విస్తరించి సాధారణ పౌరుల జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను ఆచరణలో పెట్టాల్సిన తరుణమిది.

అధిక శాతం  బొగ్గు ఆధారితమే..
విద్యుత్తులో 65 శాతానికి పైగా బొగ్గు ఆధారితమే. ఈ నల్ల బంగారం 90 శాతం మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నా.. ఆశించిన స్థాయిలో లేదనేది నిర్వివాదాంశము. ఈ నేపథ్యంలో బొగ్గు కొరత ప్రమాద హెచ్చరికలు చేస్తోంది. దీనికితోడు రోజువారీ కరెంటు వినియోగం పెరిగింది.

పర్యావరణ సమతుల్యత  దెబ్బతింటే..
అతివృష్టి, అనావృష్టి తప్పదు. వర్షాలు ఎక్కువైతే పంట నష్టం. తక్కువైతే కరవు. ఈ రెండింటితోనూ ఆహార కొరత ఏర్పడుతుంది. ఇది ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఇటీవల వర్షాలకు పంట దెబ్బతినడం, పండగ వేళ డిమాండు ఎక్కువ కావడంతో కిలో టమాట రూ.50, మిర్చి రూ.80కి చేరింది. సహజ వనరుల నుంచి వెలికి తీసే కరెంటు, పెట్రోలు మండించడం తగ్గిస్తే ఉద్గారాలు తగ్గి పర్యావరణం సమతుల్యత సాధించొచ్చు.

విద్యుత్తు వినియోగానికి సరైన ప్రణాళిక, క్రమశిక్షణ అవసరం. గదిలో ఉన్నప్పుడు వినియోగించిన ఫ్యాన్లు, లైట్లు, ఏసీ వంటివి బయటకు వెళ్లేటప్పుడు ఆఫ్‌ చేసి వెళ్లాలి. ఉపకరణాలెప్పుడూ నాణ్యమైనవి ఉపయోగిస్తే తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. తప్పనిసరిగా ఎర్తింగ్‌ ఉండేలా చూసుకోవాలి.

ఉదాసీనత  వీడి..
విద్యుత్తును పొదుపుగా వాడాలి. ఇందుకు ఏయే వస్తువు గంట పాటు నడిపిస్తే ఎంత కరెంటు వినియోగిస్తుందో ఒకసారి పరిశీలించాల్సి ఉంది.  1000 కిలోవాట్స్‌ పరికరం గంటసేపు నడిస్తే ఒక యూనిట్‌ ఖర్చు అవుతుంది.
ఈ లెక్కన కొన్నింటి సామర్థ్యం పరిశీలిద్దాం.


ఉద్గారాల లెక్కింపు ఇలా...
మనం వినియోగించే ఇంధన వనరులతో వెలువడే ఉద్గారాలను ఇంట్లోనే లెక్కించుకుంటే నియంత్రణ మార్గాలు అంచనా వేసుకోవచ్చు.

ధరల  ప్రభావం..
* బోధన్‌లో పనిచేసే ఒక టీచర్‌ రోజువారీ అవసరాల కోసం నెలకు 25-30 లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నారు. దాని ధర రూ.70-80 మధ్య ఉన్నప్పుడు నెలకు రూ.1500 వరకు వ్యయమయ్యేది. ఇప్పుడు రూ.2500-3000 మధ్య ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
* గతంలో ఆటోల్లో 10-15 మంది ప్రయాణించేవారు. కరోనా ప్రభావంతో సొంతంగా వాహనాలు సమకూర్చుకున్నారు. దీనివల్ల పెట్రోలు వినియోగం భారీగా పెరిగింది.

 

భారం తగ్గించుకోవాలంటే..
సమీప ప్రాంతాలకు కాలినడక, ఉద్యోగాలకు వెళ్తే ఒకే వాహనంపై ఇద్దరు వెళ్లడం, లేదా ఒక కారులో నలుగురు ప్రయాణించేలా రవాణా సదుపాయం కల్పించుకోవడం మేలు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని