పోలీసుల త్యాగాలు మరువలేనివి
eenadu telugu news
Updated : 21/10/2021 17:30 IST

పోలీసుల త్యాగాలు మరువలేనివి

బీర్కూర్‌: పోలీసుల త్యాగాలు మరువలేనివని ఎస్సై రాజేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసులకు ఐదు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎండ, వాన, పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్‌, ప్రభుదాస్‌, సాయిబాబ, హోంగార్డులు శకుంతల, మోహన్‌రాజు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని