రక్తదానం ప్రాణదానంతో సమానం
eenadu telugu news
Updated : 21/10/2021 17:31 IST

రక్తదానం ప్రాణదానంతో సమానం

బీర్కూర్‌: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసినట్లైతే ప్రాణదానంతో సమానమని మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం లయన్స్‌ క్లబ్‌, పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులతో కలిసి సతీశ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ మండల అధ్యక్షుడు సంతోశ్‌, ఎస్సై రాజేశ్‌, ఎంపీపీ రఘు, సర్పంచి స్వప్న, ఏఎమ్‌సీ ఛైర్మన్‌ అశోక్‌, తెరాస యూత్‌ మండల అధ్యక్షుడు శశికాంత్‌, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు విఠల్‌, సంతోష్‌, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని