ట్రాక్టరు బోల్తా : డ్రైవరు మృతి
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

ట్రాక్టరు బోల్తా : డ్రైవరు మృతి

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సిద్దాపూర్‌ శివారులో శుక్రవారం రాత్రి ట్రాక్టరు బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌ మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కార్ల గ్రామానికి చెందిన సిరిగిరి సురేష్‌(30) ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నారు. ధాన్యం లోడును సాలూరక్యాంపులోని ఓ రైస్‌మిల్‌కు తరలించి తిరిగి వెళ్తున్న క్రమంలో సిద్దాపూర్‌ శివారులో రోడ్డుపై గుంతను తప్పించబోయి ఆకస్మికంగా బ్రేకు వేయడంతో ట్రాక్టర్‌ బోల్తా పడింది.. సురేష్‌ ట్రాలీ కిందపడి తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని బోధన్‌ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై సందీప్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని