ఇంధన ధరలపై కాంగ్రెస్‌ నిరసన
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

ఇంధన ధరలపై కాంగ్రెస్‌ నిరసన

జిల్లాకేంద్రంలోని గుమాస్తాకాలనీలో వంటావార్పు నిర్వహిస్తున్న నాయకులు

కామారెడ్డి సంక్షేమం, న్యూస్‌టుడే: ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం వంటావార్పు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గుమస్తాకాలనీలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పట్టణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్‌, అతిక్‌, మైత్రిశంకర్‌, రవి, జమీల్‌, నర్సింలు, బాలకిషన్‌గౌడ్‌, ప్రశాంత్‌, కృష్ణ, జకీర్‌, జీవన్‌, ఆనంద్‌, దేవేందర్‌, వేదం పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని