అక్రమ నియామకాల రద్దు స్వాగతిస్తున్నాం
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

అక్రమ నియామకాల రద్దు స్వాగతిస్తున్నాం

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: తెవివిలో జరిగిన అక్రమ నియామకాల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిరక్షణ కమిటీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, రీసెర్చ్‌ స్కాలర్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఎల్‌బీ రవి అన్నారు. శనివారం నగరంలోని టీఎన్జీవో భవనంలో యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, రీసెర్చ్‌ స్కాలర్స్‌ అసోసియేషన్‌, విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తెవివి అభివృద్ధికి విద్యార్థి సంఘాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి జైపాల్‌, పార్ట్‌టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు యెండల ప్రదీప్‌, శ్రీకాంత్‌, లాల్‌సింగ్‌, భానుచందర్‌ పాల్గొన్నారు

తెవివి క్యాంపస్‌: తెవివిలో అక్రమ నియామకాల రద్దు వర్సిటీ ప్రక్షాళనకు నాంది కావాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌ కల్పన అన్నారు. యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీవోడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని