బైబ్యాక్‌ చేసుకొనే విత్తనాల విక్రయం
eenadu telugu news
Published : 24/10/2021 05:02 IST

బైబ్యాక్‌ చేసుకొనే విత్తనాల విక్రయం

మాట్లాడుతున్న ఆర్డీవో శ్రీనివాసులు

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: లైసెన్సు కలిగిన ఎర్రజొన్న విత్తన డీలర్లు రైతులతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకున్న తర్వాతే మూల విత్తనాలు విక్రయించాలని ఆర్మూర్‌ ఆర్డీవో వి.శ్రీనివాసులు, ఆర్మూర్‌ ఏడీఈ హరికృష్ణ స్పష్టం చేశారు. ఆర్మూర్‌ రైతువేదికలో ఎర్రజొన్న విత్తన డీలర్లు, ఆర్గనైజర్లు, రైతులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విత్తన డీలర్లు తమ సామర్థ్యానికి అనుగుణంగా మూల విత్తనాలు విక్రయించాలని సూచించారు. ఏడీఏ హరికృష్ణ మాట్లాడుతూ.. విత్తన డీలర్లు ఏయే గ్రామాల్లో ఎన్ని ఎకరాలకు మూల విత్తనం ఇచ్చారో ఆ ప్రకారం తప్పనిసరి కొనుగోలు చేయాలని సూచించారు. భీమ్‌గల్‌ ఏడీఏ మల్లయ్య, జక్రాన్‌పల్లి ఏవో దేవిక, ఏఈవోలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని