దారులు కోతకొచ్చాయ్‌
eenadu telugu news
Published : 24/10/2021 05:02 IST

దారులు కోతకొచ్చాయ్‌

కొత్త చెరువు పారడంతో ఏర్పడిన గుంత ఎల్లన్‌ కుంట సమీపంలో..

ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. రోజుల తరబడి పొలాల దారుల మీదుగా వరద పారడంతో కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వరి పంట చేతికొచ్చింది. కోత యంత్రాలు, ట్రాక్టర్లు తిరిగేందుకు వీలు లేకుండా మట్టి రోడ్లు కయ్యలుగా మారడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మాచారెడ్డి మండలంలో కొత్త చెరువు, ఎల్లన్‌ కుంట, ఆవుసుల కుంట సమీపంలో అలుగు పారుతూ ఇప్పటికీ రోడ్లపై నీరు పారుతున్నాయి. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి వాహనాలు తిరిగే విధంగా మార్చాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఎల్లన్‌కుంట సమీపంలో

- న్యూస్‌టుడే, మాచారెడ్డి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని