రోగులకు రూ. 2.2 కోట్లు ఆదా
eenadu telugu news
Published : 27/10/2021 05:22 IST

రోగులకు రూ. 2.2 కోట్లు ఆదా

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్య విభాగం

టీహబ్‌లో అత్యాధునిక పరికరాలు

తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం (డయాగ్నోస్టిక్స్‌ సెంట్రల్‌ హబ్‌) పేదలకు ఆసరాగా నిలుస్తోంది. ఆరు నెలల్లో 64,738 రకాల పరీక్షలు చేశారు. వీటికి ప్రైవేటులో రూ.2.2 కోట్లు ఖర్చయ్యేది.  ఉచితంగా అందించి పేదలకు భారం తగ్గించారు.

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వెనుక భాగంలో మే 24న టీహబ్‌ను ప్రారంభించారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అందే 56 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా పరికరాలు ఉన్నాయి.  రసాయనాల కొరత కారణంగా ప్రస్తుతం 36 రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు. నిల్వలు అందుబాటులోకి వచ్చే కొద్దీ సంఖ్య పెంచుతున్నారు.

నమూనాల సేకరణ
నిజామాబాద్‌, కామారెడ్డిలోని 42 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల నుంచి టీహబ్‌కు రక్తనమూనాలు వస్తుంటాయి. వీటితో పాటు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, వెల్‌నెస్‌ సెంటర్‌ నుంచి నమూనాలు పంపిస్తుంటారు. వీటి సేకరణకు ప్రత్యేక వాహనాలు వినియోగిస్తున్నారు. రోజుకు 3 నుంచి 4 వేల పరీక్షలు చేస్తున్నారు. ఫలితాల వివరాలను మరుసటి రోజు సంబంధిత పీహెచ్‌సీ, రోగికి సంక్షిప్త సందేశం చేస్తారు.


సద్వినియోగం చేసుకోవాలి
టీహబ్‌లో ఉచితంగా రక్తపరీక్షలు చేస్తున్నాం. రోగులు ప్రభుత్వ దవాఖానాల్లో రక్తనమూనాలు ఇస్తే సరిపోతుంది. 56 రకాల పరీక్షలకు అవసరమైన పరికరాలు ఉండగా 36 వరకు చేస్తున్నాం. రసాయనాలు రాగానే మిగిలినవి ప్రారంభిస్తాం. ప్రైవేటుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడే కంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- డాక్టర్‌ నాగరాజు, టీహబ్‌ ఇన్‌ఛార్జిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని