టీకా కేకలు
eenadu telugu news
Published : 25/11/2021 05:09 IST

టీకా కేకలు

 రెండు నెలలుగా నిండుకున్న జేఈ
కొత్త ఒప్పందం కారణంగా జాప్యం

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ వైద్యవిభాగం

బోధన్‌ మండలం పెంటా క్యాంపు, పెంటాకుర్దులో జేఈ వ్యాక్సిన్‌ మొదటి డోసుకు 16 మంది చిన్నారులు, బూస్టర్‌ డోసు కోసం  12 మంది నిరీక్షిస్తున్నారు. మెదడువాపు వ్యాధిని నియంత్రించే దీని కోసం ఈ రెండు  గ్రామాల్లోనే కాదు జిల్లా అంతటా ఎదురుచూస్తున్నారు.

12 వ్యాధులు నివారించేందుకు వేస్తున్న 12 టీకాల కార్యక్రమంలో కొరవడింది. డజను జాబితాలోని జేఈ పూర్తిగా, రోటా వైరస్‌ అక్కడక్కడ అందడంలేదు. స్వదేశీ కంపెనీ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండటంతో జాప్యం నెలకొన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి ప్రాధాన్యంగా మారడంతో పిల్లల టీకాల కార్యక్రమం మందగించిందనే అపవాదు ఉంది.

మెదడువాపు నియంత్రణ..
2004 వరకు జిల్లాలో నమోదైన మెదడువాపు వ్యాధి కేసులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఉచిత టీకాల పంపిణీ జాబితాలో జపనీస్‌ ఎన్సెఫలైటిస్‌(జేఈ)ని చేర్చింది. 15 ఏళ్లలోపు పిల్లలకు 9 నెలల్లో మొదటి డోసు, 16 నెలల్లో బూస్టర్‌ డోసు వేస్తోంది. ప్రస్తుతం 33 జిల్లాలకు గాను కేవలం 15 జిల్లాల్లోనే దీని పంపిణీ కొనసాగుతోంది. రెండు నెలల కిందటి వరకు ఉన్న నిల్వలను వినియోగించగా.. తాజాగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

24 వేల డోసులు అవసరం...
పుట్టిన నుంచి 15 ఏళ్ల వరకు వివిధ మోతాదుల్లో టీకా వేస్తారు. ఇప్పుడు రెండు నెలల నుంచి నిలిచిపోయినందున 24 వేల డోసులు అవసరమవుతాయి.


వచ్చే నెలలోగా అందుబాటులోకి..
- డాక్టర్‌ శివశంకర్‌, నిజామాబాద్‌ జిల్లా టీకాల అధికారి

కొత్త జేఈ వ్యాక్సిన్‌ సరఫరాలో జాప్యమవుతోంది. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం. ఇప్పటికే పంపిణీ ప్రారంభమైందని, వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నిల్వలు జిల్లాకు చేరిన వెంటనే అర్హులకు ఇస్తాం.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని